రూ. 50 వేల వరకు పంట రుణాలను మాఫీ చేయనున్న రాష్ట్రం?
Sakshi Education
ఇప్పటివరకు రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ. 50 వేల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరించేందుకు...
2021, ఆగస్టు 15 నుంచి నెలాఖరులోగా రూ.50 వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆగస్టు 1న ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.25 వేల వరకున్న రుణాల మాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందగా, తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఈ సంఖ్య 9 లక్షలకు పెరగనుంది.
మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు...
మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు...
- రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం గల అగ్ర కుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింప జేయాలి.
- కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు పెద్దవారై ప్రయోజ కులయ్యే వరకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించి అండగా నిలవాలి.
- తెలంగాణ దళిత బంధు పథకాన్ని 2021, ఆగస్టు 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి.
- దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’ ఏర్పాటు చేయాలి.
- గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)’గా నామకరణం చేయాలి.
- ధోభీ ఘాట్లు, సెల్లూనకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలి.
- నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు నుండి ప్రారంభించిన ఎస్సెల్బీసీ సొరంగమార్గం పనులను పున:ప్రారంభించాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ. 50 వేల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరించేందుకు...
Published date : 02 Aug 2021 06:02PM