రష్యాకి చెందిన ఏ టీకా వినియోగానికి భారత్ అనుమతి ఇచ్చింది?
Sakshi Education
రష్యా తయారీ స్పుత్నిక్ టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పుత్నిక్ టీకాను దిగుమతి చేసుకునేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు అనుమతి
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)
ఎందుకు : భారత్‌లో అత్యవసర వినియోగానికి...
స్పుత్నిక్ టీకాను దిగుమతి చేసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)నుంచి తమకు అనుమతి లభించిందని ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏప్రిల్ 13న తెలిపింది. తాజా పరిణామంతో ప్రస్తుతం కొనసాగుతున్న దేశవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు తోడు మూడో టీకా స్పుత్నిక్ రానుంది.
కొన్ని వివరాలు...
కొన్ని వివరాలు...
- స్పుత్నిక్ వినియోగానికి అనుమతులిచ్చిన 60వ దేశం భారత్ అని రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) తెలిపింది.
- కరోనా వైరస్‌పై స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోంది.
- భారత్‌లో స్పుత్నిక్ టీకా క్లినికల్ ట్రయల్స్‌తోపాటు ఉత్పత్తి చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌తో 2020 ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది.
- భారత్‌లో ఏడాదికి 850 మిలియన్ డోసుల స్పుత్నిక్ టీకాను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా... గ్లాండ్ ఫార్మా, హెటిరో, బయోఫార్మా, పనాసియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్ వంటి ప్రముఖ సంస్థలతో ఆర్‌డీఐఎఫ్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పుత్నిక్ టీకాను దిగుమతి చేసుకునేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు అనుమతి
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)
ఎందుకు : భారత్‌లో అత్యవసర వినియోగానికి...
Published date : 15 Apr 2021 05:41PM