రష్యా ప్రధాని పదవికి మెద్వదేవ్ రాజీనామా
Sakshi Education
రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వదేవ్ జనవరి 15న తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకురాదలచిన మార్పులను సానుకూలపర్చేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
మెద్వదేవ్ రాజీనామాను పుతిన్ ఆమోదించారు. అనంతరం, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉప దళపతిగా మెద్వదేవ్‌ను, తదుపరి ప్రధానిగా మైఖేల్ మిషుస్తిన్‌ను నియమించారు. ఆ వెంటనే, ఈ నియామకాల్ని పార్లమెంట్ ఆమోదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రష్యా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : దిమిత్రి మెద్వదేవ్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రష్యా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : దిమిత్రి మెద్వదేవ్
మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల రష్యా నూతన ప్రధాన మంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1. అన్సిఫా మారియా
2. మైఖేల్ మిషుస్తిన్
3. జోసెఫ్ స్టాలిన్
4. ఇవాన్ గ్రామోటిన్
- View Answer
- సమాధానం: 2
2. రష్యా రాజధాని నగరం, కరెన్సీ(వరుసగా)ని గుర్తించండి?
1. మాస్కో, యూరో
2. మాస్కో, రూబుల్
3. చిసినౌ, లియు
4. సెయింట్ పీటర్ బర్గ్, యూరో
- View Answer
- సమాధానం: 2
Published date : 17 Jan 2020 06:10PM