Skip to main content

రఫేల్ ఫైటర్ జెట్ పైలట్‌గా మహిళా పైలట్

భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 2020, సెప్టెంబర్ 10న చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్ ఒకరు చేరనున్నారు.
Edu newsఇందుకు సంబంధించి మిగ్-21 ఫైటర్ జెట్ల మహిళా పైలట్ ఒకరు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

మొదటి భారతీయ మహిళా పైలట్
2018 ఫిబ్రవరి 19న యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆమె జామ్‌నగర్ స్థావరం నుంచి మిగ్-21 బైసన్ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో అవనీ కూడా ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నారు. ఐఏఎఫ్‌లో మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,875.

చదవండి: రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్?, రఫేల్ ప్రత్యేకతలు, ఒప్పందం-వివరాలు, రఫేల్ తయారీ సంస్థ పేరు.
Published date : 22 Sep 2020 06:13PM

Photo Stories