రోవర్ అపార్చునిటీ గతించింది : నాసా
Sakshi Education
అంగారక గ్రహానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని మనకు పంపిస్తూ వచ్చిన రోవర్ అపార్చునిటీ గతించినట్లు భావిస్తున్నామని నాసా జనవరి 28న ప్రకటించింది.
అపార్చునిటీ ఉన్న పర్‌సెవరెన్స్ లోయ దక్షిణ భాగంలో ఏడు నెలల క్రితం సంభవించిన భారీ తుపానులో అది దెబ్బతిని ఉంటుందని నాసా తెలిపింది. అపార్చునిటీ నుంచి చివరిసారిగా 2018, జూన్ 10న భూమికి సంకేతాలు చేరాయి.
గోల్ఫ్ కారు పరిమాణంలో, ఆరు చక్రాలతో కూడిన అపార్చునిటీ 2004, జనవరి 24న అంగారకుడి ఉపరితలంపై కాలుమోపింది. దీనితో పాటు స్పిరిట్ అనే మరో రోవర్‌ను కూడా పంపారు. అరుణ గ్రహం నుంచి భూమికి సంకేతాలు పంపిన తొలి రోవర్‌గా అపార్చునిటీ గుర్తింపు పొందింది. అంగారకుడిపై 1,006 మీటర్లు ప్రయాణించి, 90 రోజులు సేవలందించేలా దీన్ని రూపొందించారు. కానీ 2018, ఫిబ్రవరి నాటికే 45 కిలోమీటర్లు ప్రయాణించి 5000వ రోజును పూర్తి చేసుకుంది. సహచర స్పిరిట్ మిషన్ 2011లోనే ముగిసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోవర్ అపార్చునిటీ గతించింది
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : నాసా
ఎక్కడ : అంగారక గ్ర హం

Published date : 29 Jan 2019 05:17PM