రోప్‌వేలను ఏ శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది?
Sakshi Education
రోప్‌వేలు, కేబుల్ కార్లు, ఇతరత్రా వినూత్న రవాణా సాధనాలను జాతీయ రహదారుల శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 4న కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఇది దోహదపడగలదని మంత్రి పేర్కొన్నారు. రోప్‌వేలు... ఫ్రాన్స్ లో 4,000, అమెరికాలో 2,000, స్విట్జర్లాండ్‌లో 1,500 ఉండగా, భారత్‌లో కేవలం 65 ప్రాజెక్టులే ఉన్నాయని.. వీటిల్లోనూ 22 మాత్రమే విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ రహదారుల శాఖ పరిధిలోకి రోప్‌వేలు, కేబుల్ కార్లు, ఇతరత్రా వినూత్న రవాణా సాధనాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ
ఎందుకు : రోప్‌వేలు, కేబుల్ కార్లు విస్కృతిని వేగవంతం చేసేందుకు

Published date : 06 Feb 2021 05:36PM