Skip to main content

రోజర్స్‌ కప్‌ డబ్ల్యూటీఏ టెన్నిస్‌ టోర్నీ రద్దు

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు సన్నాహకంగా జరిగే రోజర్స్‌ కప్‌ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నమెంట్‌ను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
Current Affairs
నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ ఆగస్టు 7 నుంచి 16 వరకు కెనడాలోని మాంట్రియల్‌లో జరగాల్సింది. అయితే కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా కెనడా ప్రభుత్వం ఆగస్టు 31 వరకు ఎలాంటి ఈవెంట్స్‌ నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ టోర్నీ నిర్వాహకులు 2020 ఏడాది టోర్నీని రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 12న‌ ప్రకటించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రోజర్స్‌ కప్‌ డబ్ల్యూటీఏ టెన్నిస్‌ టోర్నీ రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎక్కడ : మాంట్రియల్‌, కెనడా
ఎందుకు : కరోనా వైరస్‌ కార‌ణంగా
Published date : 13 Apr 2020 06:03PM

Photo Stories