రొమైరాను అధిరోహించిన తొలి మహిళ
Sakshi Education
మూడు దేశాల(వెనుజులా, బ్రెజిల్, గయానా) సరిహద్దులో 31 చ.కి.మీ వైశాల్యంలో ఉన్న రొమైరా పర్వతాన్ని బ్రిటన్‌కు చెందిన 21 ఏళ్ల అన్నా టేలర్ అధిరోహించింది.
దీంతో విష సర్పాలు, సాలె పురుగులు, తేళ్లు, క్రూర జంతువులకు ఆలవాలమైన రొమైరా పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా టేలర్ రికార్డు సృష్టించింది. నిట్టనిలువుగా దాదాపు 1,500 అడుగుల ఎత్తుతో ఉన్న రొమైరా పర్వతాన్ని లియో హోల్డింగ్(39) అనే పర్వాతారోహకుడి సారథ్యంలోని ఐదుగురు సభ్యుల బృందంతో కలసి టేలర్ అధిగమించింది. దట్టమైన కీకారణ్యంలో 33 మైళ్లు నడుచుకుంటూ ప్రమాదకరమైన జలపాతాలు దాటుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవడానికి దాదాపు నెల పట్టినట్లు ఈ సాహస బృందం వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రొమైరా పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : అన్నా టేలర్
ఎక్కడ : వెనుజులా, బ్రెజిల్, గయానా సరిహద్దు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రొమైరా పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : అన్నా టేలర్
ఎక్కడ : వెనుజులా, బ్రెజిల్, గయానా సరిహద్దు
Published date : 31 Dec 2019 05:28PM