Skip to main content

రంజీ, ముస్తాక్‌ అలీ టోర్నీలు మాత్రమే

కరోనాతో పాటు ఐపీఎల్‌ నిర్వహణ కారణంగా పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉండటంతో బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌ను కుదించింది.
Current Affairs
ఈ సీజన్ లో రంజీ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలు మాత్రమే నిర్వహించేందుకే బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు బ్యాటింగ్‌ దిగ్గజం, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్ సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్, ఐపీఎల్‌ తాత్కాలిక సీఈవో హేమంగ్‌ అమీన్ లతో కూడిన బృందం ఆగస్టు 9న షెడ్యూల్‌ను ప్రకటించింది. వీటితో పాటు జూనియర్, మహిళల ఈవెంట్ల వివరాలను వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం... 2020, నవంబర్‌ 19 నుంచి డిసెంబర్‌ 17 వరకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ, డిసెంబర్‌ 13 నుంచి మార్చి 10 మధ్య రంజీ ట్రోఫీలను బీసీసీఐ నిర్వహించనుంది. ఈసారి దులీప్‌ ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీలపై వేటు వేసింది.

ఈ టోర్నీలు యథాతథం..
సీనియర్‌ పురుషుల టోరీ్నల్లో కోత పెట్టిన బీసీసీఐ... జూనియర్, మహిళల క్రికెట్‌లో అన్ని టోర్నీల నిర్వహణకూ మొగ్గు చూపింది. జూనియర్‌ క్రికెట్‌లో సీకే నాయుడు అండర్‌–23 ట్రోఫీ (డిసెంబర్‌ 15– 9 మార్చి 2021), కూచ్‌ బెహర్‌ ట్రోఫీ (నవంబర్‌ 1–22 జనవరి 2021), విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ (నవంబర్‌ 1– 7 జనవరి 2021)లను జోనల్‌ విధానంలో నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రకటించింది. మరోవైపు మహిళల క్రికెట్‌లో టి20 లీగ్‌ (నవంబర్‌ 1–20), అండర్‌–23 వన్డే లీగ్‌ (నవంబర్‌ 30–డిసెంబర్‌ 23), అండర్‌–23 టి20 లీగ్‌ (జనవరి 27–ఫిబ్రవరి 15), అండర్‌–19 వన్డే లీగ్‌ (డిసెంబర్‌ 29–జనవరి 21), అండర్‌–19 టి20 ట్రోఫీ (ఫిబ్రవరి 21–మార్చి 11), వన్డే లీగ్‌ (మార్చి 17–ఏప్రిల్‌ 12)లు నిర్వహించనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : రంజీ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలు మాత్రమే నిర్వహణ
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : బీసీసీఐ
ఎందుకు:కరోనా వైరస్ కారణంగా...
Published date : 11 Aug 2020 05:49PM

Photo Stories