Skip to main content

రక్షణ రంగంలోకి మహిళలకు ప్రవేశం కల్పించిన అరబ్ దేశం?

అరబ్ దేశం సౌదీ అరెబియా... తమ దేశ రక్షణ రంగంలోకి మహిళలకు ప్రవేశం కల్పించింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030లో భాగంగా సౌదీ మహిళలకు విభిన్న విభాగాల్లో ప్రవేశం కల్పిస్తూ మహిళా సంస్కరణలు చేపట్టారు.
Current Affairs
అందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియన్‌ ఆర్మీ, రాయల్‌ సౌదీ వైమానిక దళం, రాయల్‌ సౌదీ నావికాదళం, రాయల్‌ సౌదీ వ్యూహాత్మక మిస్సైల్‌ ఫోర్స్, ఇతర సాయుధ బలగాలు, సైనిక వైద్య సేవారంగంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సౌదీ రక్షణ శాఖ ఫిబ్రవరి 22న ప్రకటించింది.

సౌది అరేబియా రాజధాని: రియాద్‌; కరెన్సీ: రియాల్‌
సౌది అరేబియా ప్రస్తుత రాజు: సల్మాన్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌ సౌద్‌
సౌది అరేబియా యువరాజు: మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌ సౌద్‌

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : రక్షణ రంగంలోకి మహిళలకు ప్రవేశం కల్పించిన అరబ్‌ దేశం?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : సౌదీ అరెబియా
ఎక్కడ : సౌదీ అరెబియా
ఎందుకు : మహిళాభ్యున్నతి కోసం రూపొందించిన విజన్‌ 2030 సంస్కరణల్లో భాగంగా
Published date : 23 Feb 2021 06:00PM

Photo Stories