Skip to main content

రక్షణ రంగ స్వావలంబన కోసం నూతన మాన్యువల్

రక్షణ రంగ స్వావలంబన కోసం కేంద్రప్రభుత్వం మరో ముందుడుగు వేసింది.
Current Affairs
స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రక్షణ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ‘కొత్త సేకరణ మాన్యువల్(DRDO Procurement Manual-2020)’ ను సిద్దం చేసింది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ మాన్యువల్‌ను అక్టోబర్ 20న న్యూఢిల్లీలో విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి, రక్షణ శాఖ ఆర్థిక విభాగం కార్యదర్శి గార్గి కౌలంద్ పాల్గొన్నారు.

ప్రధానాంశాలు...
ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేసే సమయంలో చేసే ‘బిడ్ సెక్యూరిటీ డిక్లరేషన్, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, అడ్వాన్‌‌స పేమెంట్స్ విషయంలో గరిష్ట మోతాదులో పెరుగుదల, వంటి అంశాల్లో చేసిన మార్పులు రక్షణ రంగ మాన్యువల్‌లో ప్రధానాంశాలు.

మోదీ స్వప్నం...
ప్రధాని మోదీ స్వప్నం ‘ఆత్మ నిర్భర భారత్’ సాధనకు ఈ మాన్యువల్ ఉపయోగపడుతుందని, దేశీ రక్షణ రంగ పరిశ్రమలు వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అయ్యే పనిని సులభతరం చేస్తుందని రాజ్‌నాథ్ అన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రక్షణ రంగ సేకరణ మాన్యువల్
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రక్షణ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు
Published date : 21 Oct 2020 05:42PM

Photo Stories