Skip to main content

రక్షణ మంత్రి ఆవిష్కరించిన డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ ప్రధాన లక్ష్యం?

ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 28న ఆవిష్కరించారు.
Current Affairs
నూతన డీఏపీ ప్రకారం, భారత్‌లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్‌డీఓ, డీపీఎస్‌యూలకు ప్రాధాన్యత ఇస్తారు.

డీఏపీ ప్రధాన లక్ష్యం...
భారత్‌ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా డీఏపీని రూపొందించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ) ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Published date : 29 Sep 2020 05:45PM

Photo Stories