రక్షణ కోసం తొలిసారిగా పక్షుల వినియోగం
నిత్యం దండకారణ్యంలో తిరుగాడే మావోలు కూడా ఇప్పుడు డ్రోన్లు వాడుతూ పోలీసుల కదలికలను తెలుసుకుంటూ వారి కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తు వేసేలా మావోలు, ఇతర సంఘ విద్రోహకశక్తులడ్రోన్లను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు పలు గద్దలు, డేగలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు హోంశాఖ చేసిన ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దేశంలోనే తొలిసారి...
పోలీసు శాఖలోని వివిధ విభాగాలకుతోడు అశ్వ, జాగిల దళాలు పోలీసుల విధినిర్వహణకు ఎంతో దోహదపడుతున్నాయి. ఈ రెండింటినీ పోలీసులు ప్రత్యేక దళాలుగా చూస్తారు. ఇప్పుడు గరుడదళం చేరింది. గరుడదళాన్ని వినియోగించడం దేశంలోనే ఇదే తొలిసారి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో ఈ గరుడ దళానికి శిక్షణ ఇవ్వనున్నారు. నెదర్లాండ్స్ పోలీసులు తొలిసారిగా డ్రోన్లను పట్టుకోవడంలో డేగ, గద్దలకు శిక్షణ ఇచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రక్షణ కోసం దేశంలో తొలిసారిగా పక్షుల వినియోగం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : తెలంగాణ పోలీసులు