రిలయన్స్ రిటైల్‌లో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు
Sakshi Education
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ (జీఏ) 0.84 శాతం వాటా కొనుగోలు చేయనుంది.
ఇందుకోసం రూ. 3,675 కోట్లు వెచ్చించనుంది. దీని ప్రకారం చూస్తే ఆర్‌ఆర్‌వీఎల్ విలువ సుమారు రూ. 4.285 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల్లో జీఏ మూడోది. ఇప్పటిదాకా అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లు (1.75 శాతం వాటా), మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ సుమారు రూ. 5,500 కోట్లు (1.28 శాతం వాటా) ఇన్వెస్ట్ చేశాయి. ఆర్‌ఆర్‌వీఎల్‌లో జీఏ పెట్టుబడులు పెట్టనుందని సెప్టెంంబర్ 30న రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో 0.84 శాతం వాటా కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ (జీఏ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో 0.84 శాతం వాటా కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ (జీఏ)
Published date : 01 Oct 2020 05:27PM