రెయిజ్ 2020 సదస్సులో ప్రధానంగా ఏ అంశంపై చర్చించారు?
Sakshi Education
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై చర్చించేందుకు నిర్వహించిన ‘రెయిజ్ 2020’వర్చువల్ సదస్సునుద్దేశించి అక్టోబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వాడుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయం, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, విపత్తు సహాయ చర్యలు.. తదితర విషయాల్లో ఏఐ కీలక పాత్ర పోషించనుందన్నారు. ‘యువత కోసం బాధ్యతాయత కృత్రిమ మేధ’ కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా 11 వేల మంది విద్యార్థులు బేసిక్ కోర్స్‌ను పూర్తి చేశారని, వారిప్పుడు సొంతంగా ఏఐ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారని తెలిపారు.
సదస్సు సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ... ఏఐలో అగ్రగామి దేశంగా ఎదిగేందుకు, దేశ ప్రజలందరికీ ఏఐ ప్రయోజనాలు అందించేందుకు కావల్సిన సాధన సంపత్తి భారత్ దగ్గరుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘రెయిజ్(RAISE) 2020’ సదస్సునుద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై చర్చించేందుకు

Published date : 07 Oct 2020 05:51PM