రెండు ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన రెండో కంపెనీ?
Sakshi Education
ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటల్ విలువ జూన్ 22న సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,48,50,100 కోట్లు)కు చేరింది.
దీంతో అమెరికాలో ఆపిల్ కంపెనీ తరువాత రెండు ట్రిలియన్ క్లబ్‌లోకి చేరిన రెండో కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. జూన్ 22న మైక్రోసాఫ్ట్ కంపెనీ షేర్లు 1.2 శాతాన్ని ఎగబాకాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రస్తుత షేర్ విలువ 266.34 డాలర్ల వద్ద స్థిరపడింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త విస్తరణలో భాగంగా కొత్త డేటా సెంటర్‌ను స్పెయిన్‌లో ఏర్పాటుచేయనుంది. టెలిఫోనికా కంపెనీ భాగస్వామ్యంతో ఈ డేటాసెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండు ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన రెండో కంపెనీ?
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్
ఎక్కడ : అమెరికాలో...
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండు ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన రెండో కంపెనీ?
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్
ఎక్కడ : అమెరికాలో...
Published date : 24 Jun 2021 06:20PM