Skip to main content

రెండు చమురు నౌకలపై దాడి

ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో జూన్ 13న రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు.
ఈ ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్ ఆల్టేర్’ నౌక ఇథనాల్‌ను ఖతార్ నుంచి తైవాన్‌కు ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతుండగా పేలుళ్లు సంభవించాయి. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదే మార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రెండు చమురు నౌకలపై దుండగులు దాడి
ఎప్పుడు : జూన్ 13
ఎక్కడ : హోర్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఇరాన్ సమీపం
Published date : 14 Jun 2019 05:47PM

Photo Stories