Skip to main content

రెండోవిడత వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం

సాక్షి, అమరావతి: రైతు ఆనందమే రాష్ట్ర సంతోషంగా భావించే ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్‌ను ప్రారంభించారు.
Current Affairs
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్టోబర్ 27వ తేదీన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రైతు ఖాతాలకు రూ. 1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు.రబీ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ఆర్‌ఓఎఫ్‌ఆర్) రైతులకూ రైతు భరోసా అందుతుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2019 అక్టోబర్ 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించనుంది.

ఈసారి
50,47,383 మందికి భరోసా..
వాస్తవ సాగుదార్లందరికీ రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను పరిష్కరిస్తుండడంతో ఈసారి లబ్ధిదారుల సంఖ్య 50,47,383కి చేరింది. 2019 అక్టోబర్‌లో లబ్ధిదారుల సంఖ్య 46,69,375 మంది మాత్రమే కాగా 2020 మే నెలలో ఖరీఫ్ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఇప్పుడు రబీలో ఏకంగా 50,47,383కి చేరింది. అంటే ఖరీఫ్‌తో పోల్చుకుంటే మరో 1,01,913 మంది కొత్తగా సాయం పొందినారు. 50,47,383 మంది లబ్ధిదారులకు గాను రూ.1,114.87 కోట్ల సాయం అందించారు.

ప్రస్తుత విడతలో లబ్ధిపొందే వారి వివరాలు..

రైతుభరోసా రెగ్యులర్

46,28,410

మరణించిన రైతుల ఖాతాలు

61,553

ఆర్‌ఓఎఫ్‌ఆర్

40,621

ఎండోమెంట్

623

స్పందన పరిష్కరించిన ఖాతాలు

1,881

వెబ్‌ల్యాండ్ అన్‌సీడెడ్

1,58,942

నాన్‌వెబ్‌ల్యాండ్ అన్‌సీడెడ్

53,093

కౌలుదారులు (కొత్తవి)

68,505

ఆర్‌ఓఎఫ్‌ఆర్ (కొత్తవి)

33,755

మొత్తం

50,47,383


క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ రెండోవిడత వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 27, 2020
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రబీలో రైతులకు పంట సాయంగా

Published date : 27 Oct 2020 05:31PM

Photo Stories