Skip to main content

రెండేళ్ల నిషేధానికి గురైన ఎన్‌బీఏ తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్?

ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్‌బీఏ) జట్టుకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఘనతకెక్కిన సత్నాం సింగ్ భమారా డోపింగ్‌లో దొరికిపోయాడు.
Current Affairs
దీంతో 25 ఏళ్ల భమారాపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణా ప్యానెల్ డిసెంబర్ 24న ప్రకటించింది. 2019, నవంబర్ నుంచి 2021, నవంబర్ 19 వరకు నిషేధం అమల్లో ఉంటుంది.

బెంగళూరులో దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా 2019, నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో సత్నాం సింగ్ డోపీగా తేలాడు. విచారణలో సత్నాం ‘వాడా’ నిషేధిత ఉత్ప్రేరకం హైజినమైన్ను తీసుకున్నట్లు తేలింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రెండేళ్ల నిషేధానికి గురైన బాస్కెట్‌బాల్ ప్లేయర్
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : సత్నాం సింగ్ భమారా
ఎందుకు : బెంగళూరులో దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా డోపింగ్‌కు పాల్పిడినందున
Published date : 25 Dec 2020 06:00PM

Photo Stories