రెండేళ్ల నిషేధానికి గురైన భారత హెవీవెయిట్ రెజ్లర్?
Sakshi Education
భారత హెవీవెయిట్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న సుమిత్ మలిక్ (125 కేజీలు) డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు.
అతనిపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) జూలై 2న రెండేళ్ల నిషేధాన్ని విధించింది. దీంతో సుమిత్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలకు తెరపడినట్లయింది. యూడబ్ల్యూడబ్ల్యూ ఆధ్వర్యంలో 2021, జూన్ నెలలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో 125 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో పోటీపడిన సుమిత్... ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. కానీ ఆ పోటీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు.
2018లో అర్జున అవార్డు...
2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచిన సుమిత్ మాలిక్ అదే ఏడాది భారత ప్రభుత్వం నుంచి క్రీడాపురస్కారం ‘అర్జున’ అవార్డు అందుకున్నాడు. 2017లో న్యూఢిల్లీ ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లలో అతను రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండేళ్ల నిషేధానికి గురైన భారత హెవీవెయిట్ రెజ్లర్?
ఎప్పుడు : జూలై 2
ఎవరు : సుమిత్ మలిక్ (125 కేజీలు)
ఎందుకు : డోపింగ్ పరీక్షల్లో అతను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో...

Published date : 03 Jul 2021 06:04PM