Skip to main content

రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ చేసేందుకు ఆర్డినెన్స్ తెచ్చిన దేశం?

రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ చేయడం, రేప్‌ల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం నవంబర్ 27న రెండు కొత్త ఆర్డినెన్సులు తీసుకువచ్చింది.
Current Affairs
ఈ చట్టాలను కేబినెట్ మరోమారు పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. రసాయనాల ద్వారా పుంసత్వాన్ని దెబ్బతీయడాన్ని కెమికల్ కాస్ట్రేషన్ అంటారు.

కొత్త చట్టాల ప్రకారం...
కొత్త చట్టాల ప్రకారం అన్ని వయసుల స్త్రీలను మహిళగా నిర్వచిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 15ఏళ్లలోపు స్త్రీలతో సంభోగాన్ని మాత్రమే రేప్‌గా పరిగణిస్తారు. అలాగే రేప్‌కు విధించే కెమికల్ కాస్ట్రేషన్ ప్రభావం... కేసు స్వభావాన్ని అంటే తొలిసారి నేరం చేశారా లేక పదేపదే ఇలాంటి నేరాలు చేస్తున్నారా అనే విషయాన్ని బట్టి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది.

యాంటీ రేప్ సెల్స్‌ను కూడా...
కొత్త చట్టం ప్రకారం రేప్‌కేసులకు ప్రత్యేక కోర్టులతో పాటు యాంటీ రేప్ సెల్స్‌ను కూడా ఏర్పరుస్తారు. అలాగే మహిళల కన్యత్వాన్ని పరీక్షించేందుకు చేసే టూ ఫింగర్ టెస్ట్‌ను నిషేధిస్తారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ చేసేందుకు ఆర్డినెన్స్
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎందుకు : రేప్ కేసులను అరికట్టేందుకు
Published date : 28 Nov 2020 05:59PM

Photo Stories