రచయిత్రి సత్యవతికి సాహిత్య అకాడమీ అవార్డు
Sakshi Education
విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2019 లభించింది.
2013 జనవరి నుంచి 2017 డిసెంబరు వరకు అనువాదం చేసిన రచనల ఆధారంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఫిబ్రవరి 24న తెలిపారు. మొత్తం 23 భాషల్లో అనువాదాలను ఎంపికచేయగా.. 23 మంది అనువాద రచయితలను ఈ అవార్డు వరించింది. ‘ది ట్రూత్ అబౌట్ మీ : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ’ అనే ఆంగ్ల ఆత్మకథను సత్యవతి తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా అనువదించారు. దీనికే ఈ పురస్కారం లభించింది.
1940లో గుంటూరు జిల్లాలో జన్మించిన సత్యవతి... 200కు పైగా కథలు, అనేక నవలలు రచించారు. ఇల్లు అలకగానే, మంత్రనగరి, పి.సత్యవతి కథలు వంటి కథా సంపుటాలు, ఐదు నవలలతో పాటు అనేక కథలను కూడా అనువదించారు. ఆమె రాసిన ‘వాటిజ్ మై నేమ్’ కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా.. ‘విల్ హీ కమ్ హోం’ కథ ఇంటర్‌లో పాఠ్యాంశంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి ప్రదానం చేసే కళారత్న (హంస) పురస్కారం, ఇతర పురస్కారాలు ఆమెకు దక్కాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2019
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : పి. సత్యవతి
ఎందుకు : ది ట్రూత్ అబౌట్ మీ : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ అనే ఆంగ్ల ఆత్మకథను ఒక హిజ్రా ఆత్మకథగా తెలుగులో అనువదించినందుకు

Published date : 25 Feb 2020 06:14PM