Skip to main content

రచయిత, సినీనటుడు గొల్లపూడి ఇకలేరు

ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు (81) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 12న తుదిశ్వాస విడిచారు.
Current Affairsగొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో అన్నపూర్ణ, సుబ్బారావు దంపతులకు జన్మించారు. విశాఖపట్నంలో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేశారు. తొలి రోజుల్లో ఆంధ్రప్రభ పత్రికలో ఉప సంపాదకుడిగా పనిచేశారు. 14 ఏళ్ల ప్రాయంలో తొలి కథ ‘ఆశాజీవి’, 16 ఏళ్ల వయసులో తొలి నాటకం ‘అనంతం’ రాశారు. 80 చిత్రాలకు రచయితగా పని చేసిన గొల్లపూడి ‘ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య’తో నటుడిగానూ అడుగుపెట్టారు. దాదాపు 290 చిత్రాల్లో నటించిన ఆయన ఆరు నంది పురస్కారాలను అందుకున్నారు.

సాహితీవేత్తగా, పత్రికల్లో కాలమిస్టుగానూ పేరొందిన గొల్లపూడి 9 నాటకాలు, 18 నాటికలు, 12 నవలలు, 4 కథా సంపుటాలను వెలువరించారు. ‘టాంజానియా తీర్థయాత్ర’ అనే ట్రావెలాగ్‌ను, ‘అమ్మ కడుపు చల్లగా’ పేరుతో తన ఆత్మకథను తీసుకొచ్చారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలయ్యాయి. ‘కళ్లు’ నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ రచయిత, సినీనటుడు ఇకలేరు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : గొల్లపూడి మారుతీరావు (81)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 13 Dec 2019 05:46PM

Photo Stories