Skip to main content

రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కన్నుమూత

సీనియర్ పాత్రికేయులు, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు(87) కన్నుమూశారు.
Current Affairs

గుండెపోటు కారణంగా జనవరి 10న విజయవాడలో తుదిశ్వాస వదిలారు. 1933 ఆగస్టు 10న కృష్ణాజిల్లాలో జన్మించిన తుర్లపాటి 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఏడు దశాబ్దాలపాటు పాత్రికేయునిగా, రచయితగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి జర్నలిసు్ట ఈయనే.

రచయితగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా తుర్లపాటి పనిచేశారు.

  • జర్నలిస్టుగా ఆయన ప్రస్థానం వివిధ హోదాల్లో 33 ఏళ్లపాటు ఆంధ్రజ్యోతి పత్రికలోనే కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
  • తుర్లపాటి రచనలు జాతక కథలు (1958), జాతి నిర్మాతలు (1968), మహానాయకులు (1971), 1857 విప్లవ వీరులు, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం-నా గళం వంటివి ప్రజాదరణ పొందాయి.
  • వేలాది సభలకు అధ్యక్షత వహించి 1993లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్‌‌ట్సలో స్థానం పొందారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : తుర్లపాటి కుటుంబరావు(87)
ఎక్కడ : విజయవాడ, కృష్ణా జిల్లా
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 12 Jan 2021 05:50PM

Photo Stories