రబీ పంటల కనీస మద్దతు ధర పెంపు
Sakshi Education
రబీ పంటలైన గోధుమలు, శనగలు, బార్లీ, మసూర్ పప్పు, ఆవాలు, కుసుమల మద్దతు ధరలను కేంద్రప్రభుత్వం పెంచింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అక్టోబర్ 23న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 50 లక్షల మందికి లబ్ధి కలగనుంది.
పంటల కనీస మద్దతు ధర-కేబినెట్ నిర్ణయాలు
పంటల కనీస మద్దతు ధర-కేబినెట్ నిర్ణయాలు
- 2020-21కి గాను గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.1,925గా కేబినేట్ నిర్ణయించింది. గత సీజన్‌లో ఇది రూ.1.840గా ఉండగా.. ఈసారి రూ.85 పెంచింది.
- బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.85 మేర పెంచుతూ రూ.1,525గా నిర్దేశించింది. గత సీజన్‌లో ఇది రూ.1,440గా ఉండేది.
- శనగలకు క్వింటాల్‌కు రూ.255 చొప్పున పెంచుతూ రూ.4,875గా నిర్ణయించింది.
- మసూర్ (కేసరి) పప్పు క్వింటాల్ ధర రూ.4,800గా నిర్ణయించింది. గత సీజన్‌లో ఇది రూ.4,475 ఉండగా ఈసారి రూ.325 పెంచింది.
- ఆవాలు క్వింటాలు ధర గత సీజన్‌లో రూ.4,200 ఉండగా.. ఈసారి రూ.255 పెంచింది. ప్రస్తుత సీజన్‌లో క్వింటాల్ ఆవాలు కనీస మద్దతు ధర రూ.4,425గా నిర్ణయించింది.
- కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ.275 పెంచుతూ రూ.5,215గా నిర్దేశించింది. గత సీజన్‌లో కుసుమ ధర క్వింటాల్‌కు రూ.4,945గా ఉంది.
Published date : 24 Oct 2019 05:40PM