రైతులందరికీ పీఎం-కిసాన్
Sakshi Education
దేశంలోని రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి (పీఎం-కిసాన్) పథకం వర్తింపజేయాలనే నిర్ణయంపై కేంద్రప్రభుత్వం జూన్ 8న ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులకు.. వారికెంత భూమి ఉంది అన్న విషయం పరిగణనలోకి తీసుకోకుండా ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం జేస్తారు. ప్రస్తుతం సవరించిన పథకం ప్రకారం.. మరో 2 కోట్ల మంది రైతులు దీనికింద లబ్ధి పొందుతారు. దీంతో దీని అంచనా వ్యయం కూడా 2019-20లో రూ.87,217.50 కోట్లకు పెరుగుతుంది.
ప్రస్తుతమున్న భూయాజమాన్య విధానాన్ని ఉపయోగించి లబ్ధిదారులను గుర్తించే బాధ్యత, వారి డేటా పీఎం-కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైతులందరికీ పీఎం-కిసాన్
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : కేంద్రప్రభుత్వం

Published date : 10 Jun 2019 05:54PM