రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు, విజయవాడ సరకు రవాణా కారిడార్
Sakshi Education
2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్‌న్ 2021-22 బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
ఇందులో భాగంగా ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
మరో కోటి మందికి ఉజ్వల పథకం
రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా. జమ్మూకశ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్. మరో కోటి మందికి ఉజ్వలసాయం. జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు. రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2లక్షల కోట్లు
11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్
దేశంలోని వాహనాల ఫిట్‌నెస్ పరీక్షకు ప్రత్యేక విధానం. కాలపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్ పరీక్షకు వెళ్లాలని నిబంధన. అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5వేల కోట్లు. 11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం. పశ్చిమ్ బెంగాల్‌లో రూ.25వేల కోట్లతో రహదారుల నిర్మాణం. అస్సాంలో రహదారుల అభివృద్ధికి రూ.19వేల కోట్లు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ.
నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంపు
విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థలు ఏర్పాటు. రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం. హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి. ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ.1624 కోట్లు. నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంపుకు చర్యలు.

Published date : 01 Feb 2021 12:04PM