Skip to main content

రైళ్లలో మసాజ్ ప్రతిపాదన ఉపసంహరణ

న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికులకు మసాజ్ అందించే ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు పశ్చిమ రైల్వే జూన్ 16న స్పష్టం చేసింది.
మహిళలు ప్రయాణించే చోట ఇలాంటివి తగవని, ఇది భారత సంప్రదాయాలకు విరుద్ధమైనదంటూ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వాణీ, రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు జూన్ 10న లేఖ రాసిన సంగతి తెలిసిందే. లేఖ రాసిన కొద్ది రోజులకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రారంభమయ్యే 39 రైళ్లలో తల, పాదాలకు మసాజ్ సౌకర్యాన్ని కల్పిస్తామని పశ్చిమ రైల్వేలోని రత్లమ్ డివిజన్ ప్రకటించింది. దీనిపై బీజేపీ ఎంపీ శంకర్, గత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ అభ్యంతరాలను లేవనెత్తారు. ఇది మహిళలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ మసాజ్ కేవలం తలకు, పాదాలకు మాత్రమే తప్ప శరీరమంతటికీ కాదని రత్లమ్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఆర్‌ఎన్ సుంకర్ అన్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
రైళ్లలో ప్రయాణికులకు మసాజ్ అందించే ప్రతిపాదన ఉపసంహ రణ
ఎప్పుడు: జూన్ 16
ఎక్కడ: పశ్చిమ రైల్వే
ఎందుకు: ఇది మహిళలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని..
Published date : 17 Jun 2019 06:09PM

Photo Stories