Skip to main content

రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి నిరాకరణ

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించింది.
గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సెప్టెంబర్ 7న తెలిపారు. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి కోవింద్ సెప్టెంబర్ 9 నుంచి ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఉగ్రవాదంతో దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానానికి పాక్ అనుమతి నిరాకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : పాకిస్తాన్
Published date : 09 Sep 2019 05:42PM

Photo Stories