రాష్ట్రంలోని ఏ నగరానికి వాటర్‌ప్లస్ సర్టిఫికేషన్ లభించింది?
Sakshi Education
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి నగరం మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని ఏ నగరానికి వాటర్‌ప్లస్ సర్టిఫికేషన్ లభించింది?
ఎప్పుడు : ఆగస్టు15
ఎవరు : తిరుపతి
ఎందుకు :పలు విధాలుగా నీటిని శుద్ధిచేసి ఆపై వినియోగంలోకి తీసుకొస్తున్నందున...
న్యూఢిల్లీలో ఆగస్టు 15న వాటర్‌ప్లస్ సర్టిఫికేషన్ పొందిన నగరాల జాబితాను ప్రకటించారు. ఈ పోటీల్లో తిరుపతి నగరం వాటర్ ప్లస్ విభాగంలో జాతీయ స్థాయిలో నాలుగో నగరంగా నిలిచింది. ఇండోర్, సూరత్, నార్త్ ఢిల్లీ నగరాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక నగరంగా తిరుపతి గుర్తింపు పొందింది. రేణిగుంట సమీపంలోని తూకివాకం గ్రీన్ సిటీలో ఎస్‌టీపీ ప్లాంట్‌ను కార్పొరేషన్ నిర్వహిస్తోంది. పలు విధాలుగా నీటిని శుద్ధిచేసి ఆపై వినియోగంలోకి తీసుకొస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ విభాగంలో ప్రతిభ చాటి తిరుపతి నగరం ఇప్పటికే త్రీ స్టార్ రేటింగ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఫైవ్ స్టార్ రేటింగ్‌లో పోటీ పడాలంటే తప్పనిసరి వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని ఏ నగరానికి వాటర్‌ప్లస్ సర్టిఫికేషన్ లభించింది?
ఎప్పుడు : ఆగస్టు15
ఎవరు : తిరుపతి
ఎందుకు :పలు విధాలుగా నీటిని శుద్ధిచేసి ఆపై వినియోగంలోకి తీసుకొస్తున్నందున...
Published date : 17 Aug 2021 11:43AM