రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రం ప్రారంభం
Sakshi Education
2020, ఆగస్టు 8 నుంచి 15 వరకు కొనసాగే స్వచ్ఛభారత్ వారోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 8న ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాజ్‌ఘాట్, ఢిల్లీ
ఎందుకు:మహాత్మాగాంధీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మహాత్మాగాంధీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సచ్ఛతా ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ2017లో ప్రకటించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- కరోనా వైరస్‌పై పోరులో స్వచ్ఛభారత్ కార్యక్రమం చాలా ముఖ్యమైంది.
- స్వచ్ఛభారత్ వారోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగే ‘వ్యర్థ విముక్త భారత్’ కార్యక్రమం ద్వారా వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- పరిశుభ్రత ప్రాధాన్యాన్ని చాటిచెప్పిన మహాత్మాగాంధీకి నివాళిగా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంను ప్రారంభిస్తున్నాం.
- స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఆగస్టు 8వ తేదీని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో టాయిలెట్లు నిర్మించాలని, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాజ్‌ఘాట్, ఢిల్లీ
ఎందుకు:మహాత్మాగాంధీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం కార్యక్రమం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
Published date : 10 Aug 2020 05:49PM