రాంచీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
Sakshi Education
జార్ఖండ్ రాజధాని రాంచీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
జూన్ 21న జరిగే ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయన పాల్గొంటున్న మొదటి అతి పెద్ద బహిరంగ కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఢిల్లీ, సిమ్లా, మైసూర్, అహ్మదాబాద్, రాంచీ నగరాలను ప్రాథమికంగా ఎంపిక చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) పంపింది. పీఎంఓ ఆ నగరాల నుంచి రాంచీని ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఎప్పుడు : జూన్ 2
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఎప్పుడు : జూన్ 2
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
Published date : 03 Jun 2019 05:57PM