రామాయణ ఇతివృత్తంతో నూతన రైలు
Sakshi Education
రామాయణ ఇతివృత్త నేపథ్యంతో కూడిన రైలును మార్చి చివర్లోగా తీసుకొస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఫిబ్రవరి 14న తెలిపారు.
ఈ రైలు లోపలా బయటా రామాయణాన్ని జ్ఞప్తికి తెచ్చేలా తీర్చిదిద్దుతామని, రైల్లో రామాయణ కీర్తనలు ఉంటాయన్నారు. దేశం నలుమూలల నుంచి రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా ఈ రైలు నడిపిస్తామని చెప్పారు. ‘రామాయణ్ ఆన్ వీల్స్’గా ఈ రైలు ప్రాముఖ్యత పొందుతుందన్నారు. మరోవైపు రైల్వేలు చేపట్టిన ‘జాతీయ ప్రాముఖ్యత’ కలిగిన ప్రాజెక్టులను 2023కల్లా పూర్తి చేస్తామని వీకే యాదవ్ చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రామాయణ ఇతివృత్తంతో నూతన రైలు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా
క్విక్ రివ్యూ :
ఏమిటి : రామాయణ ఇతివృత్తంతో నూతన రైలు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా
Published date : 15 Feb 2020 05:55PM