రాకెట్ లాంచర్లను పరీక్షించిన ఉత్తర కొరియా
Sakshi Education
దీర్ఘశ్రేణి బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గెడైడ్ ఆయుధాలను మే 4న ఉత్తర కొరియా పరీక్షించింది.

లాంచర్లు, గెడైడ్ ఆయుధాల సామర్థ్యాన్ని, లక్ష్యాలను ఛేదించే కచ్చితత్వాన్ని అంచనా వేసే ఉద్దేశంతో ఈ పరీక్షలు జరిపినట్లు మే 5న ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పుతీర ప్రాంతంలో ఈ పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకే తాము ఈ పరీక్షలు నిర్వహించామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గెడైడ్ ఆయుధాల పరీక్ష
ఎప్పుడు : మే 5
ఎవరు : ఉత్తర కొరియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గెడైడ్ ఆయుధాల పరీక్ష
ఎప్పుడు : మే 5
ఎవరు : ఉత్తర కొరియా
Published date : 06 May 2019 04:57PM