రాజ్యసభ సభ్యుడిగా జస్టిస్ గొగోయ్ ప్రమాణం
Sakshi Education
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ మార్చి 19న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
జస్టిస్ గొగోయ్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేస్తూ మార్చి 16న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసోం రాష్ట్రానికి చెందిన జస్టిస్ గొగోయ్ 2018, అక్టోబర్ 3 నుంచి 2019, నవంబర్ 17 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2019, నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు.
తొలి సీజేఐ...
రాజ్యసభకు నామినేట్ అయిన తొలి సుప్రీంకోర్టు మాజీ సీజేఐగా జస్టిస్ గొగోయ్ నిలిచారు. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్

Published date : 19 Mar 2020 05:44PM