రాజస్థాన్ నియామ్‌తో ఏపీ మార్కెటింగ్ శాఖ ఎంవోయూ
Sakshi Education
రైతులకు మరింత మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా రాజస్థాన్‌కు చెందిన నియామ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం... ఏపీ మార్కెటింగ్ శాఖలోని 600 మంది అధికారులు, సిబ్బందికి నియామ్ శిక్షణ ఇవ్వనుంది. మార్కెటింగ్, సహకార శాఖల్లోని సిబ్బంది, అధికారులకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వ్యాపారవేత్తలకు శిక్షణ ఇవ్వడంలో నియామ్ సంస్థ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తించిన రెండు సంవత్సరాల పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులనూ అందిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజస్థాన్‌కు చెందిన నియామ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్)తోఎంవోయూ
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ
ఎందుకు : రైతులకు మరింత మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించేందుకు

Published date : 12 Oct 2020 06:14PM