Skip to main content

రాజకీయం-దనబలం సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ప్రాంగణంలో ‘రాజకీయాల్లో ధనబలం’(మనీ పవర్ ఇన్ పాలిటిక్స్)అంశంపై ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు జనవరి 9న ప్రారంభించారు.
Current Affairsహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్, ఐఎస్‌బీల ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు ఒక వారం వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా చూస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ఏడాదంతా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో వీటిపైనే పార్టీలు దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రాజకీయాల్లో ధనబలం అంశంపై సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), హైదరాబాద్

మాదిరి ప్రశ్నలు
Published date : 10 Jan 2020 05:48PM

Photo Stories