Skip to main content

రాచరికాన్ని వదులుకున్న హ్యారీ దంపతులు

బ్రిటన్ యువరాజు హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజకుటుంబం నుంచి అధికారికంగా తప్పుకున్నారు.
Current Affairsతమకున్న రాయల్ గుర్తింపుని వదులుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందంపై హ్యారీ దంపతులు సంతకాలు చేశారు. దీంతో వారిద్దరి పేర్లకు ముందు రాచరికాన్ని ప్రతిబింబించే గౌరవ సూచకాలు ఉండవు. అలాగే బ్రిటన్ రాజ కుటుంబం వారసులుగా వారు నిర్వహించే బాధ్యతలకుగాను పన్ను రూపంలో బ్రిటన్ వాసులు చెల్లించే ఆదాయం కూడా ఇకపై వారికి అందదు.

‘హ్యారీ, మేఘన ఇక రాయల్ కుటుంబ సభ్యులు కాదు. వారి పేర్లకు ముందు గౌరవసూచకంగా వాడే టైటిల్స్‌ను (హెచ్‌ఆర్‌హెచ్) ఇకపై వాడకూడదు’’ అని బకింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటించింది. మిలటరీ అపాయింట్‌మెంట్లు సహా రాజకుటుంబం నిర్వర్తించే విధుల నుంచి కూడా వారిద్దరూ తప్పుకున్నట్టు పేర్కొంది. నెలల తరబడి నిర్మాణాత్మకంగా సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత హ్యారీ దంపతులు రాజభవనం వీడి వెళ్లడానికి తాము సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్టుగా రాణి ఎలిజబెత్ తెలిపారు.
Published date : 20 Jan 2020 05:51PM

Photo Stories