ఫుడ్ ప్రాసెసింగ్‌పై నెదర్లాండ్స్‌తో ఒప్పందం చేసుకున్న భారత రాష్ట్రం?
Sakshi Education
ఫుడ్ ప్రాసెసింగ్‌పై నెదర్లాండ్స్ ప్రభుత్వం, వివిధ సంస్థలు, కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది అవగాహన ఒప్పందాలు చేసుకుంది.
సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. రైతులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏడెనిమిది ప్రధాన పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు.
అవగాహన ఒప్పందాలు-వివరాలు
- ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో అత్యంత కీలకమైన ఇంటీరియర్ ఆర్కిటెక్చర్, డిజైన్, ప్యాకేజింగ్, కంటైనర్ల అంశాలపై నెదర్లాండ్‌స ప్రభుత్వంతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ లో న్యూఢిల్లీ నుంచి భారత్‌లో నెదర్లాండ్‌స అంబాసిడర్ మార్టెన్ వాన్ డెన్ బెర్గ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెదర్లాండ్‌స ప్రతినిధి శాన్నీ గీర్డినా క్యాంపు కార్యాలయంలో పాల్గొన్నారు.
- అరటి పంటకు సంబంధించి ఎన్‌ఆర్‌సీ బనానా తిరుచ్చితో ఒప్పందం చేసుకున్నారు. కొత్త మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ప్రమోషన్‌తో పాటు క్వాలిటీ టెస్టింగ్ ల్యాబొరేటరీలపై వారు పని చేస్తారు.
- అరటి సహా పండ్లు, కూరగాయల ఫుడ్ ప్రాసెసింగ్‌పై పుణెకు చెందిన ఫ్యూచర్‌టెక్ ఫుడ్‌స ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నారు.
- టమాటా, అరటి ప్రాసెసింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై బిగ్ బాస్కెట్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
- మామిడి, చీనీ, మిరప వంటి పంటల ప్రాసెసింగ్‌పై ఐటీసీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
- లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ (లీప్) కంపెనీ సీఈవో విజయ రాఘవన్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉల్లి ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టనున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది.
- రొయ్యలు, చేపల పెంపకంలో టెక్నాలజీ, మార్కెటింగ్ తదితర అంశాలపై ఐఎఫ్‌బీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది.
- రొయ్యలు, చేపల ఎగుమతి, రిటైల్ మార్కెటింగ్‌పై అంపైర్ కంపెనీతో ఎంవోయూ చేసుకుంది.
Published date : 05 Sep 2020 05:16PM