Skip to main content

ఫ్రెంచ్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న క్రీడాకారుడు?

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు.
Edu news
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అక్టోబర్ 11న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 2 గంటల 41 నిమిషాల్లో 6-0, 6-2, 7-5తో జొకోవిచ్‌ను ఓడించి 13వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన నాదల్‌కు 16 లక్షల యూరోలు (రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్ జొకోవిచ్‌కు 8,50,500 యూరోలు (రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించారుు.

సాధారణంగా...
సాధారణంగా ప్రతి యేటా ఫ్రెంచ్ ఓపెన్ మే-జూన్ మాసాల్లో జరుగుతుంది. కరోనా వైరస్ కారణంగా 2020 ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో నిర్వహించాల్సి వచ్చింది.

ఫెడరర్ రికార్డు సమం...
తాజాగా జరిగిన టోర్నీలో జొకోవిచ్‌ను ఓడించిన నాదల్ కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును నాదల్ సమం చేశాడు.

వంద విజయాలు...
ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్ సాధించిన విజయాలు వంద. ఫెడరర్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 100 విజయాలు నమోదు చేసిన రెండో ప్లేయర్ నాదల్. ఫెడరర్ రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 102; వింబుల్డన్‌లో 101) వంద కంటే ఎక్కువ విజయాలు సాధించాడు.
- తన ప్రొఫెషనల్ కెరీర్‌లో నాదల్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య: 999

నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్...
ఆస్ట్రేలియన్ ఓపెన్ (1): 2009
ఫ్రెంచ్ ఓపెన్ (13): 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020
వింబుల్డన్ (2): 2008, 2010
యూఎస్ ఓపెన్ (4): 2010, 2013, 2017, 2019

టాప్-5 గ్రాండ్‌స్లామ్ టైటిల్ విన్నర్స్
1. ఫెడరర్-నాదల్: 20
2. జొకోవిచ్: 17
3. సంప్రాస్: 14
4. జాన్ బోర్గ్: 11
5. కానర్స్-లెండిల్-అగస్సీ: 8

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 12 Oct 2020 06:28PM

Photo Stories