ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా యాన్ సె యంగ్
Sakshi Education
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా) విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అక్టోబర్ 27న జరిగిన ఫైనల్స్‌లో యాన్ సె యంగ్ 16-21, 21-18, 21-5తో రియో ఒలింపిక్స్ చాంపియన్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కరోలినా మారిన్ (స్పెరుున్)పై సంచలన విజయం సాధించింది.
ఈ క్రమంలో పిన్న వయస్సులో సూపర్-750 టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా యాన్ సె యంగ్ (17 ఏళ్ల 264 రోజులు) చరిత్ర సృష్టించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో చెన్ లాంగ్ (చైనా) టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్స్‌లో చెన్ లాంగ్ 21-19, 21-12తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పిన్న వయస్సులో సూపర్-750 టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : యాన్ సె యంగ్ (17 ఏళ్ల 264 రోజులు)
ఎక్కడ :ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పిన్న వయస్సులో సూపర్-750 టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : యాన్ సె యంగ్ (17 ఏళ్ల 264 రోజులు)
ఎక్కడ :ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
Published date : 29 Oct 2019 06:06PM