ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత నాదల్
Sakshi Education
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ 12వసారి గెలుచుకున్నాడు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జూన్ 9న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6-3, 5-7, 6-1, 6-1తో నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించి విజేతగా నిలిచాడు. ఇప్పటివరకు ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీని అత్యధికంగా 11 సార్లు గెలిచిన రికార్డు ఆస్ట్రేలియా క్రీడా కారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) పేరిట ఉంది. తాజా టైటిల్‌తో ఈ రికార్డును నాదల్ బద్దలు కొట్టాడు.
తాజా విజయంతో ఓవరాల్‌గా నాదల్ గెలిచిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (12 ఫ్రెంచ్; 3 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 1 ఆస్ట్రేలియన్ ఓపెన్) సంఖ్య 18కి చేరింది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డు ఫెడరర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో 82 టైటిల్స్ సాధించాడు. టైటిల్ విజేత రాఫెల్ నాదల్‌కు ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్ థీమ్‌కు 11 లక్షల 80 వేల యూరోలు (రూ. 9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : రాఫెల్ నాదల్
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్

Published date : 10 Jun 2019 06:11PM