ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ
Sakshi Education
భారత ప్రధాని నరేంద్రే మోదీ ఆగస్టు 22న రెండు రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా ప్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో మోదీ భేటీ కానున్నారు. రక్షణ, అణు శక్తి, సముద్రం, ఉగ్రవాదం వంటి అంశాలపై మేక్రాన్‌తో మోదీ చర్చించనున్నారని కేంద్ర ఆర్థిక సంబంధాల కార్యదర్శి టీఎస్ తిరుమూర్తి ఆగస్టు 19న తెలిపారు. మరోవైపు 2019, ఆగస్టు 23న పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ యూఏఈ, బహ్రెయిన్‌లకు వెళ్లనున్నారు. అనంతరం 25న తిరిగి ఫ్రాన్స్ కు వచ్చి జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ యూఏఈ, బహ్రెయిన్‌లకు వెళ్లనున్నారు. అనంతరం 25న తిరిగి ఫ్రాన్స్ కు వచ్చి జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు.
Published date : 20 Aug 2019 05:17PM