Skip to main content

ఫ్రాన్స్‌ గ్రాండ్ ప్రి విజేతగా హామిల్టన్

ఫ్రాన్స్‌ గ్రాండ్ ప్రి రేసులో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.ఫ్రాన్స్‌లో జూన్ 23న జరిగిన ఈ రేసులో 53 ల్యాప్‌లను హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 24 నిమిషాల 31.198 సెకన్లలో ముగించాడు.
అతని సహచరుడు బొటాస్ గంటా 24 నిమిషాల 49.254 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటికి 8 రేసులు పూర్తవగా అందులో 6 గెలిచిన హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 187 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. బొటాస్ 151 పాయింట్లతో, వెటెల్ 111 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రాన్స్‌ గ్రాండ్ ప్రి రేసు విజేత
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
Published date : 24 Jun 2019 06:36PM

Photo Stories