ఫ్రాన్స్ అధ్యక్ష భవనం పేరు?
Sakshi Education
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని <b>ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ‘‘ఎలీసీ ప్యాలెస్’’</b> డిసెంబర్ 17న ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవల ఫ్రాన్స్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. ఆరువారాల పాటు లాక్‌డౌన్ కూడా విధించారు. డిసెంబర్ 27 నుంచి ఫ్రాన్స్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో కరోనా బారిన పడి కోలుకున్నారు.
Published date : 18 Dec 2020 06:43PM