Skip to main content

ఫోర్బ్స్ కుబేరుడు మళ్లీ అంబానీయే ఫస్ట్

దేశంలోనే అత్యంత సంపన్నుడిగా వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా 12వ ఏడాదీ అగ్రస్థానంలో నిల్చారు.
టెలికం వెంచర్ జియో కార్యకలాపాలు గణనీయంగా విస్తరించిన నేపథ్యంలో ఆయన సంపద మరో 4.1 బిలియన్ డాలర్లు పెరిగి 51.4 బిలియన్ డాలర్లకు చేరింది. 2019కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ఈ మేరకు భారత్‌లో సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ .. ఎనిమిదో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి చేరారు. ఆయన సంపద విలువ 15.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఫోర్బ్స్ లెక్కగట్టింది. అదానీ గ్రూప్.. ఎయిర్‌పోర్టులు మొదలుకుని డేటా సెంటర్ల దాకా వివిధ వ్యాపార విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరించడం ఆయనకు కలిసివచ్చింది. 15.6 బిలియన్ డాలర్ల సంపదతో హిందుజా సోదరులు మూడో స్థానంలో ఉన్నారు. ఎకానమీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫోర్బ్స్ ఇండియా కుబేరుల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 2019లో 8 శాతం క్షీణించి 452 బిలియన్ డాలర్లకు తగ్గింది. టాప్ 100 సంపన్నుల్లో సగం మంది నికర సంపద గణనీయంగా తగ్గింది.
  • ఈసారి కనీసం 1.4 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వారిని ఫోర్బ్స్ సంపన్నుల లిస్టులో చేర్చింది. గతేడాది ఇది 1.48 బిలియన్ డాలర్లు.
  • 2019 జాబితాలో ఆరుగురు కొత్తగా చోటు సాధించారు. అల్కెమ్ ల్యాబరేటరీస్‌కి చెందిన సింగ్ కుటుంబం, బైజు రవీంద్రన్ (బైజూస్), మహేంద్ర ప్రసాద్ (అరిస్టో ఫార్మా), మనోహర్ లాల్.. మధుసూదన్ అగర్వాల్ (హల్దీరామ్ స్నాక్స్), రాజేష్ మెహ్రా (జాక్వార్), సందీప్ ఇంజినీర్ (ఆస్ట్రల్ పాలీ టెక్నిక్) వీరిలో ఉన్నారు.

పన్ను చెల్లించే కోటీశ్వరుల్లో 20 శాతం పెరుగుదల:
పన్ను చెల్లించే ఆదాయం రూ.కోటికిపైగా కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య 2018-19లో 20 శాతం పెరిగి 97,689కు చేరుకుంది. 2017-18లో వీరి సంఖ్య 81,344గానే ఉండేది. కార్పొరేట్, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), వ్యక్తుల గణాంకాలనూ కూడా కలిపి చూస్తే పన్ను వర్తించే ఆదాయం రూ.కోటిపైన ఉన్న రిటర్నుల సంఖ్య 2018-19లో 1.67 లక్షలకు చేరింది. 19 శాతం పెరిగింది.

టాప్ 10 కుబేరులు..

ర్యాంకు

పేరు(కంపెనీ)

సంపద (బిలియన్ డాలర్లు)

1.

ముకేశ్ అంబానీ(రిలయన్స్)

51.4

2.

గౌతమ్ అదానీ(అదానీ గ్రూప్)

15.7

3.

హిందుజా సోదరులు(అశోక్ లేల్యాండ్)

15.6

4.

పల్లోంజీ మిస్త్రీ(షాపూర్‌జీ పల్లోంజీ)

15

5.

ఉదయ్ కొటక్(కొటక్ మహీంద్రా బ్యాంక్)

14.8

6.

శివ్ నాడార్(హెచ్‌సీఎల్)

14.4

7.

రాధాకిషన్ దమానీ(అవెన్యూ సూపర్‌మార్‌‌ట్స)

14.3

8.

గోద్రెజ్ కుటుంబం(గోద్రెజ్ గ్రూప్)

12

9.

లక్ష్మి నివాస్ మిట్టల్(ఆర్సెలర్ మిట్టల్)

10.5

10.

కుమార మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్)

9.6


ఫోర్బ్స్‌లో తెలుగు దిగ్గజాలు..

ర్యాంకు

పేరు(కంపెనీ)

సంపద (బిలియన్ డాలర్లు)

37

మురళి దివి(దివీస్ ల్యాబ్)

3.4

39

పి.పి. రెడ్డి(మేఘా ఇంజినీరింగ్)

3.3

59

పి.వి. రామ్‌ప్రసాద్ రెడ్డి(అరబిందో ఫార్మా)

2.25

82

‘డాక్టర్ రెడ్డీస్’ కుటుంబం(సతీష్ రెడ్డి, జీవీ ప్రసాద్)

1.76


క్విక్ రివ్యూ:
ఏమిటి: ఫోర్బ్స్ కుబేరుడు మళ్లీ అంబానీయే ఫస్ట్
ఎవరు: ముకేశ్ అంబానీ
ఎందుకు: భారత్‌లో సంపన్నుల జాబితా
ఎక్కడ: భారతదేశం
Published date : 12 Oct 2019 04:40PM

Photo Stories