Skip to main content

ఫోర్బ్స్ క్రీడాకారిణుల జాబితాలో పీవీ సింధు

ఫోర్బ్ ఆగస్టు 7న విడుదల చేసిన సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితా-2019లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు 13వ స్థానంలో నిలిచింది.
15 మందితో కూడిన ఈ జాబితాలో భారత్ నుంచి సింధు మాత్రమే చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 2018 ఏడాదిలో సింధు సంపాదన రూ. 39 కోట్లు (5.5 మిలియన్ డాలర్లు)గా ఉంది. ఈ ఆదాయంలో ప్రైజ్‌మనీ, కాంట్రాక్టు ఫీజులు, బోనస్, ఎండార్స్‌మెంట్లు, అప్పియరెన్స్ ఫీజులు అన్ని కలిసి ఉన్నాయి. ఈ లిస్ట్‌లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ 29.2 మిలియన్ డాలర్ల (రూ. 207 కోట్లు)తో అగ్రస్థానంలో ఉంది.

ఫోర్బ్ టాప్-15 మహిళా అథ్లెట్లు

స్థానం

పేరు

క్రీడ

సంపాదన(రూ. కోట్లలో)

1

సెరెనా విలియమ్స్

టెన్నిస్

207

2

నవోమి ఒసాకా

టెన్నిస్

172

3

ఏంజెలికా కెర్బర్

టెన్నిస్

84

4

సిమోనా హలెప్

టెన్నిస్

73

5

స్లోన్ స్టీఫెన్స్

టెన్నిస్

68

6

కరోలిన్ వోజ్నియాకి

టెన్నిస్

53

7

మరియా షరపోవా

టెన్నిస్

49

8

కరోలినా ప్లిస్కోవా

టెన్నిస్

44

9

ఎలీనా స్వీటొలినా

టెన్నిస్

43

10

వీనస్ విలియమ్స్

టెన్నిస్

42

11

గార్బినె ముగురుజా

టెన్నిస్

41

12

అలెక్స్ మోర్గాన్

పుట్‌బాల్

41

13

పీవీ సింధు

బ్యాడ్మింటన్

39

14

మాడిసన్ కీస్

టెన్నిస్

39

15

అరియా జుటానుర్గన్

గోల్ఫ్

37


క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫోర్బ్స్ మహిళా క్రీడాకారిణుల జాబితా-2019లో 13వ స్థానం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : పూసర్ల వెంకట సింధు
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 08 Aug 2019 05:55PM

Photo Stories