ఫోర్బ్స్ జాబితాలో 57 భారత కంపెనీలు
Sakshi Education
ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ‘ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీలు-2000’ జాబితాలో మొత్తం 57 భారత కంపెనీలకు చోటు లభించింది.
జూన్ 13న విడుదలైన ఈ జాబితాలో ఇండస్టియ్రల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ) వరుసగా ఏడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది.
ఫోర్బ్స్ జాబితాలోని అంశాలు
ఫోర్బ్స్ జాబితాలోని అంశాలు
- చమురు రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అంతర్జాతీయంగా 11వ స్థానం లభించగా.. రాయల్ డచ్ షెల్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
- భారత సంస్థల్లో తొలి ర్యాంకులో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా 71వ స్థానంలో నిలిచింది.
- వినియోగదారు ఆర్థిక రంగం( కన్సూమర్ ఫైనాన్స్)లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తొలి స్థానంలో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ ఏడో ర్యాంకులో నిలిచింది. మొత్తం జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీది 332వ స్థానం.
- భారత్ నుంచి కేవలం రిలయ ఇండస్ట్రీస్ మాత్రమే టాప్-200 జాబితాలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(209), ఓఎన్‌జీసీ(220), ఇండియన్ ఆయిల్(288), హెచ్‌డీఎఫ్‌సీ(332)లు కూడా మెరుగైన ర్యాంకులనే దక్కించుకున్నాయి.
- మొత్తం జాబితాలో తొలి పది స్థానాల్లో ఐసీబీసీ, జేపీ మోర్గాన్, చైనా కన్‌స్టక్ష్రన్ బ్యాంక్, అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, యాపిల్, పింగ్ యాన్ ఇన్సూరెన్స్ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ చైనా, రాయల్ డచ్ షెల్, వెల్స్ ఫార్గోలు ఉన్నాయి.
- టాప్-500 సంస్థల్లో భారత్‌కు చెందిన టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, విప్రో ఉన్నాయి.
- 2,000 కంపెనీల తుది జాబితాలో 575 అమెరికా కంపెనీలు.. చైనా, హాంకాంగ్ (309), జపాన్ (223) కంపెనీలు ఉన్నాయి.
Published date : 14 Jun 2019 05:46PM