Skip to main content

ఫోర్బ్స్ జాబితాలో 17 భారత కంపెనీలు

ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ సెప్టెంబర్ 24న విడుదల చేసిన ప్రపంచ ఉత్తమ కంపెనీలు-2019(వరల్డ్ బెస్ట్ రిగార్డెడ్ కంపెనీస్) జాబితాలో 17 భారత కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి.
మొత్తం 250 కంపెనీలతో ఈ జాబితా విడుదల కాగా... ఇందులో అత్యధిక స్థానాలను అమెరికా(59) కైవసం చేసుకుంది. దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తాజా జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోల్చితే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. మరోవైపు టాటా గ్రూప్‌కి చెందిన మూడు కంపెనీలు ఈ జాబితాలో స్థానం సంపాందించాయి. విశ్వాసం, సామాజిక ప్రవర్తన, ఉత్పత్తి, సర్వీసుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోనికి స్టాటిస్టా భాగస్వామ్యంతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.

ఫోర్బ్స్ ఉత్తమ కంపెనీలు-2019 జాబితా

ర్యాంకు

కంపెనీ

దేశం

1

వీసా

అమెరికా

2

ఫెరారీ

ఇటలీ

3

ఇన్ఫోసిస్

భారత్

4

నెట్‌ప్లిక్స్

అమెరికా

5

పేపాల్

అమెరికా

6

మైక్రోసాఫ్ట్

అమెరికా

7

వాల్ట్‌డిస్నీ

అమెరికా

8

టయోటా మోటార్

జపాన్

9

మాస్టర్‌కార్డ్

అమెరికా

10

కాస్ట్‌కో హోల్‌సేల్

అమెరికా

22

టీసీఎస్

భారత్

31

టాటా మోటార్స్

భారత్

105

టాటా స్టీల్

భారత్

115

ఎల్ అండ్ టీ

భారత్

117

మహీంద్రా అండ్ మహీంద్రా

భారత్

135

హెచ్‌డీఎఫ్‌సీ

భారత్

143

బజాజ్ ఫిన్‌సర్వ్

భారత్

149

పిరమల్ ఎంటర్‌ప్రెజైస్

భారత్

153

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా

భారత్

155

హెచ్‌సీఎల్ టెక్

భారత్

157

హిందాల్కో

భారత్

168

విప్రో

భారత్

204

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

భారత్

217

సన్ ఫార్మా

భారత్

224

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

భారత్

231

ఐటీసీ

భారత్

248

ఏషియన్ పెయింట్స్

భారత్

Published date : 25 Sep 2019 06:05PM

Photo Stories