ఫోర్బ్స్ ఇండియా జాబితాలో కోహ్లికి అగ్ర స్థానం
Sakshi Education
ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన ‘ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీలు-2019’ జాబితాలో దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు.
2018, అక్టోబర్ 1 నుంచి 2019, సెప్టెంబర్ 30 మధ్య దేశంలో అత్యధిక సంపద ఆర్జించిన 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాను డిసెంబర్ 19న ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రూ. 252.72 కోట్ల ఆదాయంతో కోహ్లి మొదటిస్థానం దక్కించుకున్నాడు. అలాగే రూ. 293.25 కోట్ల ఆదాయంతో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రెండో స్థానం పొందాడు. రెండో స్థానంలో ఉన్న అక్షయ్‌తో పోలిస్తే ఆదాయంలో తక్కువైనా.. పాపులారిటీలో చాలా ముందున్న కారణంగా కోహ్లికి తొలి స్థానం ఇచ్చినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీలు-2019 జాబితా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీలు-2019 జాబితాలో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : క్రికెటర్ విరాట్ కోహ్లి
ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీలు-2019 జాబితా
ర్యాంకు | పేరు | సంపద(రూ. కోట్లలో) |
1 | విరాట్ కోహ్లి | 252.72 |
2 | అక్షయ్ కుమార్ | 293.25 |
3 | సల్మాన్‌ఖాన్ | 229.25 |
4 | అమితాబ్ | 239.25 |
5 | ధోని | 135.93 |
8 | ఆళియా భట్ | 59.21 |
9 | సచిన్ | 76.96 |
10 | దీపికా పదుకోనె | 48 |
11 | రోహిత్ శర్మ | 54.29 |
13 | రజనీకాంత్ | 100 |
16 | ఏఆర్ రెహ్మాన్ | 94.8 |
44 | ప్రభాస్ | 35 |
54 | మహేశ్ బాబు | 35 |
63 | పీవీ సింధు | 21.05 |
72 | {తివిక్రమ్ శ్రీనివాస్ | 21.5 |
81 | సైనా నెహ్వాల్ | 3 |
85 | సునీల్ చెత్రి | 6.1 |
88 | మిథాలీ రాజ్ | 2.63 |
90 | స్మృతి మంధాన | 2.85 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీలు-2019 జాబితాలో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : క్రికెటర్ విరాట్ కోహ్లి
Published date : 20 Dec 2019 05:50PM